జగిత్యాల విద్యార్థికి రాష్ట్ర స్థాయి బహుమతి
NEWS Sep 22,2024 12:50 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మానస స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బి. శిశిర్ చంద్ర హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజ్ఞా వికాస్ వ్యాసరచన పోటీలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించి నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ట్రస్మా ఆధ్వర్యంలో రాష్ట స్థాయిలో నిర్వహించిన ఈ వ్యాస రచన పోటీలో శిశిర్ చంద్రకు తన అసాధారణ ప్రతిభకు ₹ 8,000 నగదు బహుమతి అందించి అభినందించారు.