ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
NEWS Sep 22,2024 06:40 pm
గిరిజన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని స్థానిక టిడిపి డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు చెప్పారు. మండలంలోని గుంటగన్నెల పంచాయతీ కబడ జాముగుడలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించారు. 100రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, చేయూత, అభివృద్ధిపై ఇంటింటికెళ్లి గిరిజన కుటుంబాలకు వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన కరపత్రాలతో అవగాహన కల్పించారు.