వికలాంగుల పెన్షన్ 6000కు పెంచాలి
NEWS Sep 22,2024 06:41 pm
వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడివయ్య డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ లో జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మాణిక్, ప్రధాన కార్యదర్శి బసవరాజ్ పాల్గొన్నారు.