టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్ష
NEWS Sep 22,2024 11:03 am
తిరుమల ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నెయ్యి టెండర్లు, టీటీడీ ప్రక్షాళనతోపాటు ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారుల ఇచ్చిన సూచనలను ఈవో సీఎంకు వివరించారు.