అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధి పటేల్ గుడా, కృష్ణరెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాహుబలి మిషన్ రిపేర్ పూర్తవ్వడంతో కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. పటేల్ గుడాలో ఇప్పటి వరకు హైడ్రా అధికారులు 4 భవనాలు నేలమట్టం చేశారు. భారీ యంత్రాలతో మిగతా కట్టడాలను కూడా కూల్చి వేస్తున్నారు.