మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్
NEWS Sep 22,2024 08:41 am
అమృత్ టెండర్లలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి KTR సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తున్నానని, ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం.. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పులు ఏం జరగలేదు అంటే.. తాను రాజకీయ సన్యాసం చేస్తా.. అని కేటీఆర్ అన్నారు.