డీజేను బ్యాన్ చేయాలి: ఒవైసీ
NEWS Sep 22,2024 08:33 am
డీజే డాన్సులతో యువత చెడిపోతున్నారని, ప్రజల్లో డీజే వల్ల ఎలాంటి మంచి సందేశం వెళ్లడం లేదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మతపరమైన ర్యాలీల్లో డీజేలపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా చార్మినార్ వద్ద డీజే బాక్స్ పేలడంపై స్పందిస్తూ డీజే సంస్కృతితో ఆధ్యాత్మిక వాతావరణం కలుషితం అవుతోందన్నారు. డీజే కావాలి అని కోరుకునే వాళ్లకు క్లబ్బులు, పబ్బులు లాంటివి సిద్ధంగా ఉంటాయన్నారు.