శ్రీవారి ప్రసాదం లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.