అరుదైన రక్తదాతకు అభినందనలు
NEWS Sep 22,2024 08:52 am
జగిత్యాల జిల్లా కోరుట్లలో నిండు గర్బిణీ ప్రసవ నిమిత్తం అత్యవసర పరిస్థితిలో చాలా అరుదుగా లభించే "ఓ" నెగెటివ్ రక్తం అవసరం ఉండగా కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ సమాచారం అందించారు. దీంతో గ్రూపు సభ్యుడు మహ్మద్ హఫీజ్ అలీ మెట్‌పల్లికి వెళ్లి రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన అలీకి అమెర్ ఖాన్, రియాజుద్దీన్, పలువురు అభినందించారు.