మా గ్రామంలో బెల్ట్ షాపులు వద్దు
NEWS Sep 22,2024 08:58 am
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశమవుతున్నాయి. గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని పోస్టర్లు వెలిశాయి. వినాయక నిమజ్జనం కోసం గ్రామంలో డీజేలు పెట్టవద్దని వీడీసీ కమిటీ తీర్మానించింది. నిమజ్జనంలో కొన్ని యూత్ సంఘాలు డీజేలను పెట్టారని వీడీసీ కమిటీ జరిమాన విధించింది. దీంతో గత 4 రోజులుగా వీడిసీకి, గ్రామ యువతకు మద్య వివాదం చోటుచేసుకుంది, ఇదే పరిస్థితి నేపథ్యంలో గ్రామంలో పోస్టర్లు దర్శనమిచ్చాయి.