అమీన్ పూర్ మండలం పటేల్ గూడా గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 12 లో అక్రమ నిర్మాణాలను హైడ్రాధికారులు ఆదివారం భారీ పోలీసు బందోబస్తు వద్ద కూల్చివేశారు. గ్రామంలో 16 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు హైడ్రాధికారులు తెలిపారు. భవనాల కూల్చివేత సమయంలో స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బందోబస్తు మధ్యనే అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.