హైదరాబాద్ కూకట్ పల్లి నల్ల చెరువులో అక్రమంగా నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేసింది. దీంతో అక్కడ వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతమయ్యారు. లక్షలు ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని.. వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు ఏడుస్తూ అధికారులను వేడుకుంటున్నా .. హైడ్రా అధికారులు వారి పని వారు చేశారు.