జిల్లాలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను విఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ పదోన్నతితో ఉపాధ్యాయులు బాధ్యత పెరిగిందని చెప్పారు. ఉన్నత పాఠశాలలో మరింత మెరుగైన బోధన అందించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.