తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ టేక్మాల్ మండలం కుసంగి ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథం ఆదివారం మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యం రావడంతో కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రధానోపాధ్యాయిని మృతికి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తుకారం సంతాపం తెలిపారు.