జంగిల్ క్లియరెన్స్ చేయాలి
NEWS Sep 22,2024 11:07 am
ఆంధ్ర-ఒడిశా సరిహాద్దు డుంబ్రిగుడ మండలం జైపూర్ జంక్షన్ నుంచి అడపవలస మీదుగా ఒడిశా ప్రాంతం చటువా ప్రాంతానికి వెళ్లే రహదారిలో తుప్పలు పెరిగి పోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని వాహనచోదులు చెబుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి జంగిల్ క్లియర్తో పాటు రహదారిలో సిగ్నల్ ఏర్పాటు చేయాలని వాహన చోదకులు, స్థానికులు కోరుతున్నారు.