జిల్లాస్థాయి క్రీడలకు ఎంపిక
NEWS Sep 22,2024 09:09 am
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం గోధుర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడాలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారి మధు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 24 నుండి జరిగే కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, షాట్ ఫుట్, రన్నింగ్ పోటీలలో పాల్గొంటారని పీడీ డాకూరి రవి తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.