జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా గ్రామపంచాయితీలో ఎలక్ట్రిషియన్ అరిగడ్డి రాజేష్ కి తీవ్ర జ్వరంతో నిజామాబాద్ హాస్పిటల్ లో చికిత్స కోసం రూ.2 లక్షలు ఖర్చు అయింది. అతనిది నిరుపేద కుటుంబం కావడంతో పంచాయతీ కార్యదర్శులు,స్నేహితులు బంధువులు ద్వారా సేకరించిన 20,000 రూపాయలను ఎంపీడీఓ ఎస్. చంద్రశేఖర్ చేతుల మీదుగా రాజేష్ కు ఆర్థిక సాయం అందించారు. పంచాయితీ కార్యదర్శి నిరోష, నాయకులు భూక్య విజయ్ పాల్గొన్నారు.