మెట్‌పల్లి నుంచి వేంపేట మీదుగా నిర్మల్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. రైల్వే గేటు కింద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. గుంతల్లో పడి గాయాల పాలవుతున్నామని గుర్తు తెలియని వ్యక్తులు అధికారులను నిద్ర లేపేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. గుంతల పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మమ్మల్ని పూడ్చండి అంటూ వ్యంగ్యంగా డిమాండ్ చేస్తున్నారు.