లడ్డూ పవిత్రత పునరుద్ధరించాం: TTD
NEWS Sep 21,2024 06:54 pm
తిరుమల లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించినట్లు టీటీడీ తెలిపింది. నందిని డెయిరీ నెయ్యితో తాజాగా లడ్డూలు తయారు చేసినట్లు పేర్కొంది. ల్యాబ్ రిపోర్టులు ట్వీట్ చేసింది. గతంలో వాడిన నెయ్యిలో S వ్యాల్యూ 100కు 19 పాయింట్లు ఉండగా, ప్రస్తుతం వాడిన నెయ్యిలో S వ్యాల్యూ 100కు 97 పాయింట్లు ఉన్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బెంగళూరులోని నందిని నెయ్యి ఉన్న 2 టాంకర్లను తిరుమలకు పంపించారు.