సిడిపి పనుల పురోగతిపై కలెక్టర్ రివ్యూ
NEWS Sep 21,2024 06:36 pm
సిడిపి పనుల స్థితిగతులపై నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శనివారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సిడిపి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిరిసిల్ల జిల్లాలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల పనులకు సంబంధించి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ద్వారా 51 కోట్ల85 లక్షలకు పైగా విలువ గల1833 పనులు మంజూరు చేయడం జరిగిందని, సమీక్షలో సీపీఓ శ్రీనివాసాచారి, పీఆర్ ఈఈ భూమేష్, పాల్గొన్నారు.