రేషన్ డీలర్ ల నియామకాల్లో అవకతవకలు.
NEWS Sep 21,2024 06:34 pm
సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ ల నియామకాల అవకతవకలపై కలెక్టర్ వెంటనే స్పందించాలని శనివారం సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షుడు కొయ్యడ రమేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో రమేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలే స్వయంగా నియామకాల్లో అవకతవకలు జరిగాయని మాట్లాడడంతో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాట్ల మధు, సారంపల్లి మాజీ సర్పంచ్ రమేష్, గోడిసెల ఎల్లయ్య, అమర్ రావు పాల్గొన్నారు.