వీర్నపల్లిలో పలు ప్రభుత్వ విద్యాలయాల ఆకస్మిక తనిఖీ.
NEWS Sep 21,2024 06:38 pm
సిరిసిల్ల జిల్లా: విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. వీర్నపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదులు, వంట గది, సామాగ్రి, స్కూల్ ఆవరణ పరిశీలించారు. అలాగే మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో భోజనం గది, కిచెన్, ఆహార పదార్థాలను తనిఖీ చేశారు.