లడ్డూ కల్తీపై మోహన్ బాబు వ్యాఖ్యలు
NEWS Sep 21,2024 05:40 pm
తిరుమల లడ్డూ వివాదంపై సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు స్పందిస్తూ ఇంతటి అపచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఘోరం, పాపం, ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకమని, శ్రీవారి భక్తుడినైన తాను చింతించానని అన్నారు. ఇది నిజమైతే నేరస్థులను శిక్షించాలని సీఎం చంద్రబాబుని కోరుకుంటున్నానని అన్నారు.