ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన
NEWS Sep 21,2024 06:32 pm
విద్యార్థి దశ నుండే వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమలపై, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాస్సేస్ నిర్వహించారు. శనివారం సిరిసిల్ల పట్టణ ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ పేజ్ -2 అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిధిగా హాజరై ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, సైన్ బోర్డ్స్, వాహనాల చట్టాలు, రోడ్ భద్రత నియమాల అవగాహన కల్పించారు.