డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అమలాపురం మండల పరిధిలోని బండారులంక జడ్పీ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.