సీఎం రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల అమృత్ పథకంలో టెండర్ల పేరుతో భారీ స్కాం చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే, ఫిబ్రవరిలో 8,888 కోట్ల రూపాయల భారీ స్కాం చేశారని, దీంతో.. రేవంత్ పదవి కోల్పోయే అవకాశం ఉందని కేటీఆర్ చెప్పారు. రేవంత్ బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకపోయినప్పటికీ.. వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టినట్టుగా ఆరోపించారు.