సీఎం రేవంత్‌కి హరీశ్ బహిరంగ లేఖ
NEWS Sep 21,2024 04:54 pm
వరద బాధితులకు తక్షణ సాయం అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు. వరద ప్రభావం తగ్గి 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందలేదని, ఇది కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. విపత్తుల టైంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని, మృతుల కుటుంబాలకు 25 లక్షలు, ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయిన వారికి 10 లక్షలు, పంట నష్టానికి 25 వేలు, పశువులు నష్టపోతే 1 లక్షకు తగ్గకుండా ఆర్థిక సాయం అందించాలన్నారు.