ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్న పవన్
NEWS Sep 21,2024 04:54 pm
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మనసు కలత చెందిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఘోర అపచారం, సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ దీనికి ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనన్నారు. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని పవన్ ప్రకటించారు. నంబూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో రేపు దీక్ష ప్రారంభిస్తానన్నారు.