జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం పొడిగా, వేడిగా ఉండగా సాయంత్రం సమయానికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఒక్కసారిగా కురిసింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో, ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మండలం ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.