తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మౌలిక సదుపాయాలు సంబంధించిన పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కృషి చేస్తానని తెలిపారు.