కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్
చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS Sep 21,2024 03:26 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేశారు. కోరుట్ల పట్టణానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు రూ. 38,04,408 విలువ గల కల్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, BRS నాయకులు పాల్గొన్నారు.