నిజాంపేట మండలం నాగదర్ గ్రామంలో పిడుగుపాటు జరిగి 20 మేకలు మృతి చెందాయి. నాగదర్ గ్రామానికి చెందిన దుద్యాల మాణిక్యం ఈరోజు మేకలను మేపేందుకు తీసుకెళ్లాడు. వర్షం రావడంతో మేకలను చెట్టు కింద నిలపగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పిడుగుపాటు జరిగింది. పిడుగుపాటు జరిగి చెట్టు కింద నిలిచిన 20 మేకలు మృతి చెందినట్లు బాధితుడు మాణిక్యం పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని మాణిక్యం కోరారు.