జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామ శివారులో శనివారం సాయంత్రం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు టీవీఎస్ ఎక్సెల్ బండిని ఢీ కొట్టింది, ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టారు.