ఆదివారం బాల గణపతి నిమజ్జనం
NEWS Sep 21,2024 06:14 pm
అమలాపురం దుడ్డు వారి అగ్రహారంలోని బాలగణపతి విద్యార్థి సంఘం స్వామివారి మండపం వినాయకుడిని శనివారం కలంలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఈ కలములను భక్తులకు, విద్యార్థి విద్యార్థినిలకు పంపిణీ చేశారు. అనంతరం ఈ శనివారం అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం బాల గణపతి ఊరేగింపు, నిమజ్జనం జరుగుతుందన్నారు.