శ్రీరాంనగర్ కాలనీలో కుక్కల బెడద
NEWS Sep 21,2024 01:10 pm
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా మారింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే స్థానిక ప్రజలు భయపడుతున్నారు. చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి, కాలనీలో మహిళలు బయట తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.