తుప్పుపడుతున్న మున్సిపాలిటీ వాహనాలు
NEWS Sep 21,2024 01:09 pm
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన వాహనాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో యంత్రాలు తుప్పు పడుతున్నాయని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని స్థానికులు మండిపడుతున్నారు. వాహనాల మరమ్మతులకు రూ. 10 లక్షలు కేటాయించినప్పటికీ ఆశించిన రీతిలో ఫలితం కన్పించడం లేదు. వాహనాలు లేక చెత్త పేరుకుపోవడంతో జనాలు వ్యాధుల బారిన పడుతున్నారు.