బీజేపీ ఆధ్వర్యంలో సేవ పక్షం
NEWS Sep 21,2024 01:08 pm
మెట్‌పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా పక్షం కొనసాగుతోంది. సేవ పక్షంలో భాగంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా 15 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సేవ పక్షం జగిత్యాల జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి బాబు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్, నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ తదితరులున్నారు.