ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి: మమత
NEWS Sep 21,2024 01:01 pm
అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా గర్భవతులకు ఒక పూట పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని దీనిని గర్భవతులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల సీడీపీవో మమత అన్నారు. పోషణ మాసం సందర్భంగా శనివారం ప్రాజెక్టు పరిధిలోని జగిత్యాల అర్బన్, రూరల్, రాయికల్, మేడిపల్లి మండలాలలోని అంగన్వాడీ కేంద్రాల్లో సీడీపీఓ మమత ఆధ్వర్యంలో గర్భవతుల ఆహారము, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు