ఓటర్ గుర్తింపు కార్డు తొలగించిన ఫిర్యాదుపై విచారణ
NEWS Sep 21,2024 01:07 pm
మల్లాపూర్ మండలం సాతారంలో బింగి నవీన్ అనే వ్యక్తి ఓటర్ గుర్తింపు కార్డు తొలగించినట్టు కలెక్టర్ కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ బి సత్య ప్రసాద్ బాధితుని ఇంటికి స్వయంగా వెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం అధికారులతో మాట్లాడగా వారు గ్రామంలో ఇద్దరి పేర్లు ఒకే విధంగా ఉండటం వల్ల ఇటువంటి సమస్య వచ్చింది తెలిపారు. వారి వెంట మెట్‌పల్లి ఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ రఘువరన్ ఉన్నారు.