మద్యం సేవించి వాహనం నడిపిన
కేసులో ఇద్దరికీ 4 రోజుల జైలు శిక్ష
NEWS Sep 21,2024 12:26 pm
మద్యం సేవించి వాహనా నడిపిన కేసులో ఇద్దరికీ 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ శ్రీ గంప కరుణాకర్ శనివారం తీర్పునిచ్చారు. ట్రాఫిక్ ఎస్.ఐ రామచంద్రం తెలిపిన వివరాల ప్రకారం వడ్లకొండ నాగభూషణం (గ్రామం పూడూరు), గుండేటి మధుసూదన్(మెట్ పల్లి) అనే ఇద్దరు వ్యక్తులు అతిగా మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడపడంతో కేసు నమోదుచేసి సంబంధిత కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఒక్కరికి 4 రోజుల జైలు శిక్ష విధించారన్నారు.