ప్రకాశ్‌రాజ్‌కు మంచు విష్ణు కౌంటర్
NEWS Sep 21,2024 11:12 am
లడ్డూ వివాదంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్‌రాజ్ స్పందిస్తూ.. మీరెందుకు అనవసర భయాలను వ్యాపింపజేస్తూ, జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి మంచు విష్ణు కౌంటర్ ఇస్తూ.. తిరుమల లడ్డూ నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన ఆచారాలను పరిరక్షించేందుకు ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు. ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? అని ట్వీట్ చేశారు. మీ హద్దుల్లో మీరు ఉండండి అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు.