కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్లో
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్
NEWS Sep 21,2024 10:57 am
MNCL: హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కొండాలక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి కావడం గర్వంగా ఉందని ప్రేమ్ సాగర్ రావు అన్నారు.