మండలంలో పర్యటించిన కలెక్టర్
NEWS Sep 21,2024 10:40 am
మల్లాపూర్: మల్లాపూర్ మండలం దామరాజ్‌పల్లిలో శనివారం కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించారు. 7వ వార్డులో ఉన్న ఇంటి నంబర్‌ని వేరే వాడకు బదిలీ చేశారని కుటుంబీకులు ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించి జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడి వారి ఇంటి నంబర్‌ను యథావిధిగా ఏడో వార్డులో నమోదు చేయాలని పంచాయతీ సెక్రెటరీకి ఆదేశాలు ఇచ్చారు. ఆర్డీవో శ్రీనివాస్, డీపీఓ రఘువరన్ తదితరులున్నారు.