అక్రమ కట్టడాలు కట్టకుండా చర్యలు
NEWS Sep 21,2024 10:42 am
అక్రమ కట్టడాలు కట్టకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మెట్‌పల్లిలోని చెరువుకు అతి సమీపంలో ఉన్న ఇండ్లకు నోటీసులు అందిన నేపథ్యంలో శనివారం అయన వాటిని పరిశీలించారు. ఇక ముందు అక్రమ కట్టడాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, తాహశీల్దార్ ఇతర అధికారులు ఉన్నారు.