లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా?
NEWS Sep 21,2024 09:09 am
తమిళనాడు ఎన్‌టీకే పార్టీ అధినేత, నటుడు సీమాన్ తిరుమల లడ్డూ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దేశంలో తిరుమల లడ్డూ తప్ప ఇంకా ఏ సమస్యలు లేవా? ఆ కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశాడు. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి కానీ.. లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అని అన్నారు.