రాగిఆకుపై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రం
NEWS Sep 21,2024 08:47 am
మునిపల్లి మండలం పెద్ద గోపులారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అనురాధ రాగి ఆకుపై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రాన్ని గీశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా రాగి ఆకుపై చిత్రించి ఆ మహనీయుడికి నివాళి అర్పించినట్లు ఆమె చెప్పారు. రాగి ఆకుపై చిత్రాన్ని గీసిన ఉపాధ్యాయురాలు అనురాధను మండల విద్యాధికారి ప్రత్యేకంగా అభినందించారు.