దుర్గామాత ఆలయానికి శ్రీకాంత్ విరాళం
NEWS Sep 21,2024 08:52 am
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శ్రామిక నగర్ స్వయంభు దుర్గామాత దేవాలయ కమిటీ సభ్యులకు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు,సెంట్రల్ ఆంధ్రా ప్రచార కమిటీ కో - ఆర్డినేటర్ బొళియశెట్టి శ్రీకాంత్ దంపతులు రూ. 10,116 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా తన వంతు సహకారం అందించినట్లు చెప్పారు. ప్రజలందరిపై దుర్గా మాత ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.