విద్యార్థులతో స్వచ్ఛత ర్యాలీ
NEWS Sep 21,2024 08:50 am
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.