కొండా లక్ష్మణ్ బాపూజీ వర్దంతి వేడుక
NEWS Sep 21,2024 08:45 am
జగిత్యాల: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని బాపూజీ విగ్రహానికి పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ మహనీయుని సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ అడువాల జ్యోతి, బిజెపి నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి, పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు బోగ గంగాధర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.