గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
NEWS Sep 21,2024 08:43 am
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్ గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ వి.రమణ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. రమణ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.